Kakumanu: కాకుమానులో పొడి చెత్తకు దసరా బంపర్ ఆఫర్: ఎంపీడీవో

Kakumanu: కాకుమాను మండలంలో స్వచ్ఛ రథం ద్వారా పొడి చెత్త సేకరణకు దసరా బంపర్ ఆఫర్ ప్రకటించారు. అదనంగా 20% నగదుతో పాటు లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందించనున్నారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 29 Sept 2026 7:04 PM IST
Kakumanu
X

Kakumanu: కాకుమానులో పొడి చెత్తకు దసరా బంపర్ ఆఫర్: ఎంపీడీవో

గుంటూరు జిల్లా: దసరా పండుగ సందర్భంగా కాకుమాను మండలంలోని గ్రామ ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించడంతో పాటు, పొడి చెత్త సేకరణను ప్రోత్సహించేందుకు “స్వచ్ఛ రథం దసరా బంపర్ ఆఫర్” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు MPDO, కాకుమాను తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ ఇళ్ల వద్ద ఉన్న *పొడి చెత్త (Dry Waste)*ను స్వచ్ఛ రథానికి అందజేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 2026 అక్టోబర్ 24వ తేదీ వరకు స్వచ్ఛ రథానికి అందజేసే పొడి చెత్తకు ప్రస్తుత ధర కంటే అదనంగా 20% ధర చెల్లించనున్నట్లు తెలిపారు.

అలాగే, ప్రతి 10 కిలోల పొడి చెత్త లేదా అంతకంటే ఎక్కువ అందజేసిన వారికి ప్రత్యేకంగా లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. లక్కీ డ్రాలో ఎంపికైన వారికి 1వ బహుమతి ఎలక్ట్రిక్ మిక్సీ, 2వ బహుమతి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, 3 వ బహుమతి స్టీల్ కడాయి వంటి బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.

ఇంట్లోని పొడి చెత్తను వేరుగా సేకరించి స్వచ్ఛ రథానికి అందించాలి. తడి చెత్త, పొడి చెత్తను కలపకుండా వేరు చేయాలి. ప్లాస్టిక్, పేపర్, కార్డ్‌బోర్డ్, ఇతర రీసైకిల్ చేయగల పొడి చెత్తను స్వచ్ఛ రథానికి అందించాలి.

గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.

“మన గ్రామం – మన బాధ్యత” అనే స్ఫూర్తితో ఈ దసరా సందర్భంగా స్వచ్ఛత కార్యక్రమంలో ప్రతి గ్రామ ప్రజలు భాగస్వాములు కావాలని MPDO, కాకుమాను కోరారు.

ఇట్లు,

మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO)

కాకుమాను మండలం.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU