Guntur: ప్రజా సమస్యల అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి!
Guntur: గుంటూరు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ. అర్జీలను నాణ్యతతో, గడువులోగా పరిష్కరించాలని జేసీ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశం.
Guntur: ప్రజా సమస్యల అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి!
Guntur: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారం నాణ్యతతో కూడినదై ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ వాస్తవ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల సత్వర పరిష్కారం కోసం అర్జీలను అందజేస్తుంటారని వారి అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలన్నారు.
అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతో పాటు, పరిష్కారం సాధ్యంకాని అంశాలపై స్పష్టమైన కారణాలను అర్జీదారులకు తెలియజేయాలని ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం లో డి ఆర్ ఓ ఎన్ ఎస్ కె ఖాజావలి, డిప్యుటీ కలెక్టర్ డేవిడ్, డ్వామా పిడి శంకర్, జిల్లా విద్యా శాఖాధికారి సలీం భాష, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి సత్యనారాయణ, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.




