Amaravathi: అమరావతి మండలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి: నంబూరు

Amaravathi: అమరావతి మండలంలోని సీఆర్‌డీఏ గ్రామాలతో సహా అన్ని పంచాయతీలకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ, పల్నాడు కలెక్టర్‌కు నంబూరు శంకరరావు విజ్ఞప్తి చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 24 Sept 2026 7:07 PM IST
Amaravathi
X

Amaravathi: అమరావతి మండలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి: నంబూరు

అమరావతి: అమరావతి మండలంలోని అన్ని గ్రామ పంచాయితీ లతో పాటు CRDA పరిధిలో చేరిన గ్రామాలకు స్థానికలు ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని విజయవాడ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ని, నరసరావుపేట లో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ని పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు.

పల్నాడు జిల్లా, అమరావతి మండలంలో మొత్తం 19 గ్రామపంచాయతీలకు గాను ఇటీవలే వైకుంఠపురం, పెదమద్దూరు, చావపాడు, ఎండ్రాయి, లేమల్లె, కర్లపూడి గ్రామాలను CRDA పరిధిలోకి తీసుకుని, ఆయా గ్రామాలలో భూసమీకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, అమరావతి మండలంలోని అన్ని గ్రామాలకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా! లేదా కొన్ని గ్రామాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తారా? అనే అంశంపై ప్రజల్లో స్పష్టతలేదని దీనిపై వివిధ సామాజిక మాధ్యమాలలో చర్చ జరుగుతోందని తెలిపారు.

గ్రామాల అభివృద్ధికి స్థానిక సంస్థలు ఎంతో కీలకమైనవని,ఎన్నికైన గ్రామసర్పంచ్ లు , ఎంపీటీసీలు మరియు జడ్పీటీసీల ద్వారా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రభుత్వ పథకాలను మరింత సమర్ధవంతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. గ్రామాలకు నిధులు అందుబాటులోకి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావడానికి కూడా స్థానిక సంస్థలు అవసరమని అన్నారు.

ఈ అంశాలను దృష్టిలో ఉంచికొని CRDA పరిధిలోకి వచ్చిన గ్రామాలతో సహా అమరావతి మండలంలోని అన్ని గ్రామపంచాయతీలకు, సంబంధిత ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ స్థానాలకు చట్టబద్ధమైన నిబంధనలు మరియు ఎన్నికల నియమావళికి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ని, కలెక్టర్ కృతికా శుక్ల ని పెదకూరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు కోరారు.

మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అందించిన వినతి పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా, జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల సానుకూలంగా స్పందిస్తూ చట్టభద్ధంగా, ఎన్నికల నియమావలి అనుసరిస్తూ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN