Guntur: గుంటూరులో దడ పుట్టిస్తున్న డీజేల మోత.. బెంబేలెత్తుతున్న ప్రజలు!
Guntur: గుంటూరు నగరంలో వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో అనుమతి లేని డీజేల మోతపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Guntur: గుంటూరులో దడ పుట్టిస్తున్న డీజేల మోత.. బెంబేలెత్తుతున్న ప్రజలు!
గుంటూరు: గుంటూరు నగరంలో వినాయక నిమజ్జన ఊరేగింపులు కొనసాగుతున్న వేళ... పలుచోట్ల డీజేల మోతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం డీజేలు, సౌండ్ సిస్టమ్స్ వినియోగానికి సంబంధిత అధికారుల అనుమతి అవసరం. అయితే...అనుమతులు లేకుండానే డీజేలు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భారీ శబ్దాలతో డీజేలు మోగిస్తుండటంతో స్థానికులు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు చెబుతున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు వినాయక చవితి వేడుకల్లో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
మరి... అనుమతులు లేకుండా డీజేలు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.




