Guntur: గుంటూరులో రాష్ట్రంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ జీనోమిక్ సొల్యూషన్ సెంటర్ ప్రారంభం!
Guntur: రాష్ట్రాన్ని క్యాన్సర్ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: గుంటూరు జీజీహెచ్‌లో తొలిసారి ఇంటిగ్రేటెడ్ జీనోమిక్ సొల్యూషన్ సెంటర్ ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.
Guntur: గుంటూరులో రాష్ట్రంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ జీనోమిక్ సొల్యూషన్ సెంటర్ ప్రారంభం!
గుంటూరు: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కామెంట్స్, రాష్ట్రాన్ని క్యాన్సర్ రహిత రాష్ట్రంగా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. 8.74 లక్షల మంది క్యాన్సర్ బారిన పడ్డారు. అందుకే క్యాన్సర్ నివారణ కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద తీసుకుని పనిచేస్తున్నారు.
జెన్యుపరంగా వస్తున్న క్యాన్సర్ గుర్తింపు కోసం ఇంటిగ్రేటెడ్ జీనోమిక్ సొల్యూషన్ సెంటర్ ను ప్రారంభించాము. ఓరల్ క్యాన్సర్,బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ప్రజలు ముందుకు వస్తున్నారు. కానీ కొన్ని అపోహలు కారణంగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ప్రజలు ముందుకు రావటం లేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 120 కోట్ల తో కర్నూల్ లో క్యాన్సర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నాము.
క్యాన్సర్ కారణంగా ఎవరూ చనిపోకూడదనే క్యాన్సర్ పై శ్రద్ద పెట్టాము. ఏపీ లోనే మొదటి సారిగా గుంటూరు లో ఇంటిగ్రేటెడ్ జీనోమిక్ సొల్యూషన్ సెంటర్ ను ప్రారంభించాము. రెండేళ్ళలో 15 వందల కోట్లు క్యాన్సర్ పై ఖర్చు చేసాము. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు వికసిత్ భారత్ 2047 పనిచేస్తుంది.




