Gurazala: గురజాలలో హైకోర్టు ఆదేశాలతో పోలీసు బందోబస్తు నడుమ నామినేషన్లు!

Gurazala: హైకోర్టు ఆదేశాలతో ఆదివారం భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక బస్సులో తరలించి గురజాల ఆర్డీవో కార్యాలయంలో సర్పంచ్ నామినేషన్లు స్వీకరించారు.

SK SAIDA, GURAJALA
Published on: 22 Nov 2026 2:38 PM IST
Gurazala
X

Gurazala: గురజాలలో హైకోర్టు ఆదేశాలతో పోలీసు బందోబస్తు నడుమ నామినేషన్లు!

పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గం లోని మూడో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు రెండో రోజు ప్రారంభం. నియోజకవర్గం లోని వైసీపీ పార్టీ చెందిన అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డగించిన టిడిపి నాయకులు కార్యకర్తలు. హైకోర్టు ఆశ్రయించిన వైసిపి పార్టీ అభ్యర్థులు.

హైకోర్టు ఆదేశాలతో భారీ పోలీసులు బందోబస్తు నడుమ స్పెషల్ బస్సులో అభ్యర్థులను తీసుకువెళ్లి గురజాల ఆర్డిఓ ఆఫీస్ లో నామినేషన్ ప్రారంభించిన అధికారులు... గురజాల పట్టణంలోని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా చేరుకున్న పోలీసు బలగాలు.

SK SAIDA, GURAJALA

SK SAIDA, GURAJALA