Gurazala: ముసాయిదా ఓటర్ల జాబితాపై ఆర్డీవో సమీక్ష సమావేశం

Gurazala: గురజాల ఆర్‌డిఓ కార్యాలయంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీలతో సమీక్ష. ఆగస్టు 31 వరకు మార్పులు, చేర్పులకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడి.

SK SAIDA, GURAJALA
Published on: 1 Aug 2026 6:50 AM IST
Gurazala
X

Gurazala: ముసాయిదా ఓటర్ల జాబితాపై ఆర్డీవో సమీక్ష సమావేశం

గురజాల: గురజాల నియోజకవర్గంలో ముసాయిదా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా గురజాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డిఓ మురళీకృష్ణ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశాలలో ఓటర్ల జాబితా పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ మరియు కొత్త పేర్ల నమోదు వంటి అంశాలపై చర్చించారు.ముసాయిదా జాబితా మరియు షెడ్యూల్ వివరాలు , అభ్యంతరాల ఉంటే జూలై 31 నుండి ఆగస్టు 31 వరకు ఓటర్లు తమ పేర్ల చేర్పులు, మార్పులు లేదా తొలగింపుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు.

ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 28 వరకువచ్చిన అభ్యంతరాలను అధికారులు పరిశీలిస్తారు.తుది ఓటర్ల జాబితా విడుదల అక్టోబర్ 3న జాబితాను ప్రచురిస్తారు అని తెలిపారు.ఓటర్లకు సూచనలు ఓటర్లు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా స్థానిక బూత్ లెవల్ అధికారుల వద్ద పరిశీలించుకోవచ్చు అన్నారు.జాబితాలో పేరు లేకపోతే లేదా తప్పులు ఉంటే, ఫారం-6 లేదా తగిన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి అన్నారు...

SK SAIDA, GURAJALA

SK SAIDA, GURAJALA