Gurazala: గురజాలలో ముగిసిన మున్సిపల్ నామినేషన్లు: యరపతినేని!

Gurazala: గురజాల నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీల్లో 91 వార్డులకు ఎన్డీయే నామినేషన్లు పూర్తయ్యాయని, కూటమి ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

SK SAIDA, GURAJALA
Published on: 18 Oct 2026 8:54 PM IST
Gurazala
X

Gurazala: గురజాలలో ముగిసిన మున్సిపల్ నామినేషన్లు: యరపతినేని!

గురజాల: గురజాల నియోజకవర్గ పరిధిలోని మూడు మున్సిపాలిటీల నామినేషన్ల ప్రక్రియ పూర్తి, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఘట్టం ముగింపు, మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 91 వార్డులకు ఎన్డీయే అభ్యర్థుల నామినేషన్లు 81 వార్డుల్లో టీడీపీ, 8 వార్డుల్లో జనసేన, 2 వార్డుల్లో బీజేపీ పోటీ, ప్రజల మద్దతుతో నామినేషన్లు దాఖలు చేసిన ఎన్డీయే అభ్యర్థులు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నామినేషన్ల అడ్డగింత, దౌర్జన్యాలపై విమర్శలు, గత ఐదేళ్ల అవమానాలు, మానసిక వేదనను ధైర్యంగా ఎదుర్కొన్నామని వెల్లడి, మూడు మున్సిపాలిటీల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యమని స్పష్టం, మూడు పార్టీల మధ్య ఐక్యతతో ఎన్నికల్లో ముందుకు సాగుతామని, గురజాల నియోజకవర్గంలో ఫ్యాక్షనిజం, గొడవలు, హత్యా రాజకీయాలకు తావులేకుండా చేయడమే గతంలో జరిగిన ఘటనల్లో కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన.

గత రెండేళ్ల మూడు నెలల్లో కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని, రాబోయే మండల, జిల్లా పరిషత్, సర్పంచ్ ఎన్నికల్లోనూ ఎన్డీయేకు మద్దతివ్వాలని విజ్ఞప్తి. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలని, అమరావతి నిర్మాణం, ప్రాజెక్టుల పూర్తి, గురజాల నియోజకవర్గ అభివృద్ధికి సమష్టి కృషి చేయాలని.

SK SAIDA, GURAJALA

SK SAIDA, GURAJALA