Gurazala: గురజాలలో మున్సిపల్ నామినేషన్ల వేడి
Gurazala: గురజాల నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ఐసీడీఎస్ కార్యాలయంలో శుక్రవారం నుంచి ప్రారంభం కానుండగా, అడిషనల్ ఎస్పీ రోహిత్ చౌదరి భద్రతను సమీక్షించారు.
Gurazala: గురజాలలో మున్సిపల్ నామినేషన్ల వేడి
Gurazala: గురజాల నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ హీట్ గా మారనున్నట్లు తెలుస్తుంది. స్థానిక దూబ చెరువు సమీపంలో గల ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి కార్యాలయం మొదటి అంతస్తులో నామినేషన్లు శుక్రవారం నుండి ఆదివారం వరకు 3 రోజులు నామినేషన్లు స్వీకరణ జరగనుంది.
ఈ కేంద్రంలో చైర్మన్, వార్డు సభ్యులు నామినేషన్ దాఖలు చేస్తారు. మొదటి దశ 2021 ఎన్నికల లోగురజాల పంచాయతీ , జంగమహేశ్వరపురం పాఠశాల నామినేషన్ కేంద్రాలుగా ఏర్పాటు జరిగింది. గురజాల దూబచెరువు ప్రాంతం నామినేషన్ ల ప్రక్రియతో రాజకీయ గుర్తింపు పొందింది..
అడిషనల్ ఎస్పీ పర్యటన..
ఎన్నికల నగరా మోగడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గురువారం పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్ పి రోహిత్ కుమార్ చౌదరి గురజాలలో పర్యటించారు.
పట్టణంలో పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములను ఆయన పరిశీలించారు. ఈయన వెంట ఎస్ డి పి వో ఎం. మహేశ్వర రావు, సీఐ ఎం. మురళీ, ఎస్ ఐ వినోద్ కుమార్, కమీషనర్ శివన్నారాయణ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డా. ఆకుల సత్యనారాయణ తదితరులు ఉన్నారు.




