Gurazala: కోర్టు ఆదేశాలతో 146 నామినేషన్లు.. 76 దాఖలు
Gurazala: పల్నాడు జిల్లా గురజాల డివిజన్ పరిధిలో కోర్టు ఆదేశాల మేరకు 146 గ్రామ పంచాయతీ నామినేషన్లకు గాను సోమవారం నాటికి 76 నామినేషన్లు దాఖలయ్యాయి.
Gurazala: కోర్టు ఆదేశాలతో 146 నామినేషన్లు.. 76 దాఖలు
గురజాల: గురజాల... గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు వివిధ మండలాల్లో మొత్తం 146 నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా, సోమవారం నాటికి 76 నామినేషన్లు దాఖలైనట్లు అధికారుల నివేదిక వెల్లడించింది.
మండలాల వారీగా పరిశీలిస్తే గురజాల మండలంలో 19 నామినేషన్లకు సంబంధించి కోర్టు ఆదేశాలు వెలువడగా, వాటిలో 18 నామినేషన్లు దాఖలయ్యాయి. మాచర్లలో 23కి గాను 18, వెల్దుర్తిలో 33కి గాను 19, పిడుగురాళ్లలో 21కి గాను ఒకటి, దుర్గిలో 8కి గాను 2 నామినేషన్లు దాఖలయ్యాయి.
అదేవిధంగా మాచవరంలో ఒక నామినేషన్ దాఖలు కాగా, కారంపూడిలో ఒకటి, మరికొన్ని మండలాల్లో కూడా నామినేషన్లు దాఖలయ్యాయి. రెంటచింతలలో రెండు నామినేషన్లకు సంబంధించి కోర్టు ఆదేశాలు వచ్చినప్పటికీ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దాచేపల్లిలో 14 నామినేషన్లకు సంబంధించి ఒక్కటి కూడా దాఖలు కాలేదు.
మొత్తంగా కోర్టు ఆదేశాల మేరకు దాఖలు కావాల్సిన 146 నామినేషన్లలో 76 నామినేషన్లు మాత్రమే దాఖలైనట్లు నివేదికలో పేర్కొన్నారు.




