Gurazala: గురజాలలో దారుణం లారీ ఢీకొని 40 గొర్రెలు మృతి
Gurazala: గురజాల పట్టణ శివారులో ఘోర ప్రమాదం. గొర్రెల మందపైకి దూసుకెళ్లిన వేగవంతమైన లారీ. 40 గొర్రెలు అక్కడికక్కడే మృతి, మరో 10 గొర్రెలకు గాయాలు: పోలీసుల కేసు.
Gurazala: గురజాలలో దారుణం లారీ ఢీకొని 40 గొర్రెలు మృతి
గురజాల: గురజాల పట్టణ శివారులోని హైవే లో గొర్రెల మీదికి దూసుకు వెళ్లిన లారీ 40 గొర్రెలు మృతి ఈ సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
గొర్రెల కాపరి తెలిపిన వివరాలు ప్రకారం మహబూబ్నగర్ జిల్లా రామచంద్రపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరీలు చెన్నయ్య, శ్రీను, కేశవులు గొర్రెల మేత కోసం గురజాల వైపు వచ్చినట్లు తెలిపారు.
గురజాల నుంచి రెంటచింతల వైపు వెళ్తుండగా గురజాల పట్టణ శివారులోని గొర్రెల మంద వెళ్తుండగా వెనకనుంచి లారీ వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే 40గొర్రెలు చనిపోగా మరో 10 గొర్రెలకు కాళ్లు విరిగాయి.
అలాగే ఈ దాడిలో గొర్రెల కాపరి అయిన కేశవులకు కాలుకి చిన్న పాటి గాయమైంది.. ఈ మేరకు గురజాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...




