Guntur: గుంటూరు నగరపాలక సంస్థలో ఘనంగా మహాకవి గురజాడ జయంతి వేడుకలు!

Guntur: గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లో గురజాడ అప్పారావు జయంతి. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అదనపు కమిషనర్ ఐ.కిషోర్.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 21 Sept 2026 5:10 PM IST
Guntur
X

Guntur: గుంటూరు నగరపాలక సంస్థలో ఘనంగా మహాకవి గురజాడ జయంతి వేడుకలు!

Guntur: మహాకవి గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకుని గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ ఐ.కిషోర్, విభాగాధిపతులు గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, సమాజంలోని మూఢనమ్మకాలు, అసమానతలు, సామాజిక రుగ్మతలను తన రచనల ద్వారా ప్రశ్నించిన గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో సామాజిక చైతన్యం, సమానత్వ భావనను పెంపొందించడంలో ఆయన రచనలు ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు. “దేశమంటే మట్టి కాదోయ్... దేశమంటే మనుషులోయ్” అనే మహత్తర సందేశం ద్వారా దేశభక్తి, మానవతా విలువలను ప్రజలకు చాటిన గురజాడ అప్పారావు ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సి.హెచ్ శ్రీనివాస్, సియంఓహెచ్ డాక్టర్ శాంతి కళ, యంహెచ్ఓ డాక్టర్ సురేష్, డి.సి.పి సూరజ్ కుమార్, ఏఓ తిరుపతి నాయుడు, మేనేజర్ బాలాజీ బాష, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN