Guntur: గుంటూరులో పారిశుద్ధ్య సమస్యలపై వైయస్సార్సీపీ నిరసన, పర్యటన!

Guntur: గుంటూరు నగరంలో పారిశుద్ధ్య సమస్యలపై వైయస్సార్సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 7 Oct 2026 9:09 AM IST
Guntur
X

Guntur: గుంటూరులో పారిశుద్ధ్య సమస్యలపై వైయస్సార్సీపీ నిరసన, పర్యటన!

Guntur: గుంటూరు నగరంలోని 13వ డివిజన్, ముస్లిం సమాధుల వెనుక వైపు ఉన్న కమ్మ బజార్ మరియు పవర్ పేట ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు తీవ్రమైన శానిటేషన్ (పారిశుద్ధ్య) సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలుసుకుని, వారి పిలుపు మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా ఆ ప్రాంతాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, వారు రోజూ ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రోడ్లపై పేరుకుపోయిన చెత్తాచెదారం, దుర్వాసన మరియు దోమల బెడద వల్ల ప్రజలు పడుతున్న వేదనను స్వయంగా పరిశీలించారు.

వెంటనే స్పందించిన షేక్ నూరి ఫాతిమా అక్కడి నుండే సంబంధిత మున్సిపల్ అధికారులకు ఫోన్ కాల్ ద్వారా సమస్య తీవ్రతను వివరించారు. సాధ్యమైనంత త్వరగా ఆ ప్రాంతంలోని చెత్తను తొలగించి, పారిశుద్ధ్య సమస్యను పూర్తిగా క్లియర్ చేయాల్సిందిగా అధికారులను గట్టిగా కోరారు.

ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన ఆమె, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నిరంతరం పోరాటం చేస్తామని స్థానిక ప్రజలకు భరోసా కల్పించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN