Guntur: పొన్నూరు రోడ్డులో కొత్త వైన్ షాప్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన

Guntur: గుంటూరు పొన్నూరు రోడ్డులో నివాస ప్రాంతాల మధ్య మద్యం షాపు ఏర్పాటును వ్యతిరేకిస్తూ వైసీపీ ఈస్ట్ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా నిరసన తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 3 Oct 2026 4:45 PM IST
Guntur
X

Guntur: పొన్నూరు రోడ్డులో కొత్త వైన్ షాప్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన

గుంటూరు: గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పొన్నూరు రోడ్డులో నూతన మద్యం షాపు ఏర్పాటును రద్దు చేయాలని గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు, ఈస్ట్ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా డిమాండ్ చేశారు.

శనివారం ఆ ప్రాంతంలో స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. నూరి ఫాతిమా మాట్లాడుతూ ప్రజా నివాసాల మధ్య మద్యం షాపులను ఏ విధంగా ఏర్పాటు చేస్తారని అని ప్రశ్నించారు.

మహిళ బాధ్యత అంటే కూటమి ప్రభుత్వానికి ఇంత చిన్నచూపు ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన మద్యం షాపు ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN