Guntur: ఎమ్మెల్యే గళ్ళా మాధవి సమక్షంలో టీడీపీలో చేరికలు!
Guntur: గుంటూరు పశ్చిమ 31వ డివిజన్ వైఎస్సార్‌సీపీ నేతలు ఎమ్మెల్యే గళ్ళా మాధవి సమక్షంలో టీడీపీలో చేరారు. అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై చేరినట్లు వెల్లడి.
Guntur: ఎమ్మెల్యే గళ్ళా మాధవి సమక్షంలో టీడీపీలో చేరికలు!
గుంటూరు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 31వ డివిజన్‌కు చెందిన పలువురు వైసీపీ నాయకులు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఎమ్మెల్యే గళ్ళా మాధవి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు నాలుగు చక్రాల బండ్ల పంపిణీ, ముస్లిం సోదరుల అంత్యక్రియల కోసం రూ.15 లక్షల విలువైన వాహనం అందజేత, పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 55 మంది విద్యార్థులకు ఢిల్లీ విహారయాత్ర వంటి కార్యక్రమాలు తమను ఆకర్షించాయని పేర్కొన్నారు.
అలాగే, ప్రతి వారం డివిజన్లలో మెగా వైద్య శిబిరాల నిర్వహణ, మహిళలు, కార్యకర్తలు, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలు చేపడుతూ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండటాన్ని అభినందించారు.
*టీడీపీలో చేరిన వారిలో..*
1. కుందనాటి సంజయ్ బాబు – ఏకలవ్య ఎరుకల ట్రైబల్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి.
2. బెల్లంకొండ శ్రీనివాస్ – వైఎస్సార్‌సీపీ 31వ వార్డు బీసీ సెల్ అధ్యక్షుడు.
3. బొగ్గవరపు ఏసుపాదం – వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు.
4. బొగ్గవరపు సతీష్ బాబు – వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకుడు.
5. వణుకూరి శివరామకృష్ణ ప్రసాద్ – వైఎస్సార్‌సీపీ 31వ వార్డు బీసీ సెల్ కార్యదర్శి.
6. బొమ్మిశెట్టి మధు.
7. గార్లపాటి రమేష్.
8. మామిడాల సత్యనారాయణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి 31వ డివిజన్ అభ్యర్థి గంటా మౌళికతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.




