Guntur: వినాయక మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Guntur: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వినాయక మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదం పంపిణీ.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 23 Sept 2026 5:38 PM IST
Guntur
X

Guntur: వినాయక మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని నిర్వాహకులను అభినందించారు.

ముందుగా గుంటూరు శ్రీనివాసరావుపేట 1వ లైన్ మరియు ఆర్ అగ్రహారం 4వ లైన్ ప్రాంతాల్లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే గళ్ళా మాధవి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం సంపత్ నగర్‌లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని నిర్వాహక కమిటీ సభ్యులను అభినందించారు.

అదేవిధంగా గుజ్జనగుండ్ల సెంటర్‌లో ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి, వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN