Guntur: గుంటూరు: గ్యార్మీ పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Guntur: గుంటూరు పశ్చిమ 23వ డివిజన్ గొర్రెలదొడ్డిలో జరిగిన గ్యార్మీ వేడుకల్లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొని భక్తులకు స్వయంగా అన్నదానం చేసి ప్రత్యేక దువా నిర్వహించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 4 Oct 2026 9:37 PM IST
Guntur
X

Guntur: గుంటూరు: గ్యార్మీ పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Guntur: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 23వ డివిజన్ గొర్రెలదొడ్డి ప్రాంతంలో గార్మీ పండుగ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్నదానం చేశారు. అనంతరం ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి ప్రత్యేక దువాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మత సామరస్యం, సోదరభావానికి గ్యార్మీ లాంటి పండుగలు ప్రతీకగా నిలుస్తాయని, అన్ని వర్గాల ప్రజలు శాంతి, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ముస్లిం మత పెద్దలు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN