Guntur: 83 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
Guntur: గుంటూరు పశ్చిమలో రూ.1.34 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను 83 మంది లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి.
Guntur: 83 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
గుంటూరు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు 83 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
మొత్తం రూ.1,34,78,692 విలువైన చెక్కులను అందజేసి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించారు. ఇప్పటి వరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 767 మంది లబ్ధిదారులకు రూ.10,60,30,615 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.




