Guntur: గుంటూరు వెస్ట్‌లో జనసేన ఎన్నికల కమిటీ సమీక్ష!

Guntur: గుంటూరు పశ్చిమ జనసేన కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ సమీక్షా సమావేశం. అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి బలోపేతంపై చర్చ.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 13 Oct 2026 2:49 PM IST
Guntur
X

Guntur: గుంటూరు వెస్ట్‌లో జనసేన ఎన్నికల కమిటీ సమీక్ష!

Guntur: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో, పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియమితులైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశానికి పశ్చిమ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తలు చందు సాంబశివరావు, బండ్రెడ్డి లీలా కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను మరింత పెంపొందించడం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది. రానున్న ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకతను ఈ సమావేశంలో వివరించారు.

అదేవిధంగా, స్థానికంగా ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలపై అవగాహన కలిగి ఉన్న నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తూ అభ్యర్థిత్వాల పరిశీలన చేపట్టే అంశంపై చర్చించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులు, గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరిస్తున్న నాయకుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ నిర్వాహక దళ్ సభ్యులు, జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు, గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు తమ అభ్యర్థిత్వానికి సంబంధించిన దరఖాస్తు పత్రాలను సమర్పించి, రానున్న ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు తమ ఆసక్తిని తెలియజేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను మెరుగుపరచడం, అర్హులైన అభ్యర్థులను గుర్తించడం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం వంటి లక్ష్యాలతో ఈ సమీక్షా సమావేశం నిర్వహించబడింది.


B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN