Guntur: గుంటూరు TDPలో టికెట్ సెగ: చంద్రబాబుకు నరేంద్ర ఆవేదన!
Guntur: గుంటూరు 44వ డివిజన్ టికెట్ దక్కకపోవడంపై టీడీపీ నేత పోపూరి నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, పల్లా శ్రీనివాస్ న్యాయం చేయాలని కోరారు.
Guntur: గుంటూరు TDPలో టికెట్ సెగ: చంద్రబాబుకు నరేంద్ర ఆవేదన!
అయ్యా నారా చంద్రబాబు నాయుడు ,పళ్ళ శ్రీనివాస్ నాకు న్యాయం చేయండి. 44వ డివిజన్ కార్పొరేటర్ గా టికెట్ ఆసించి భంగపడ్డ పోపూరి నరేంద్ర ఆవేదన. కష్టకాలంలో పార్టీకి పనిచేశానని జండా మోసిన తనను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గుర్తించలేదని చెప్పారు.
44వ డివిజన్ తో సంబంధం లేని వ్యక్తికి, ఎమ్మెల్యే దగ్గర పనిచేసే గుర్రం ప్రసాద్‌కు కార్పొరేటర్ గా టికెట్ ఇవ్వటంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పినా ఎమ్మెల్యే గళ్ళ మాధవి టికెట్ ఇవ్వకుండా పెడచెవిన పెట్టారని వాపోయారు.
ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడి పని చేశానని ఎన్నో కేసులు పెట్టించుకున్నానని చెప్పారు. తనకు కార్పొరేటర్ గా టికెట్ ఇస్తానని నమ్మించి చివరి నిమిషంలో మోసం చేసి గుర్రం ప్రసాద్ టికెట్ ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు.
నాకు జరిగిన ఈ అన్యాయంపై సీఎం చంద్రబాబు నాయుడు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస్ నాకు న్యాయం చేయాలని వేడుకొన్నారు. ఇలాంటి సంఘటనల వల్ల పార్టీ నష్టపోతుందని ఈ విషయం పై పార్టీ హై కమాండ్ సీరియస్ గా వ్యవహరించాలని కోరారు.




