Guntur: తాడికొండలో చీకటి గోపి మృతి కేసుపై విచారణకు ఎస్పీ ఆదేశం!

Guntur: తాడికొండ పీఎస్ పరిధిలో చీకటి గోపి అనుమానాస్పద మృతి కేసుపై సమగ్ర విచారణకు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశం. విచారణ అధికారిగా సౌత్ డివిజన్ డీఎస్పీ పూర్ణచంద్రరావు నియామకం.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 21 Sept 2026 5:06 PM IST
Guntur
X

Guntur: తాడికొండలో చీకటి గోపి మృతి కేసుపై విచారణకు ఎస్పీ ఆదేశం!

గుంటూరు: గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చీకటి గోపి మృతి కేసుపై విచారణకు ఆదేశాలు, పొన్నెకల్లు గ్రామానికి చెందిన నెల్లూరు ప్రసాద్‌ ఉంగరం చోరీపై నాగేంద్రమ్‌ ఫిర్యాదు మేరకు ఆగస్టు 25న Cr.No.140/2026 కేసు నమోదు. ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన చీకటి గోపి (30) మృతిపై Cr.No.145/2026గా మరో కేసు నమోదు.

చీకటి గోపి మృతికి గల కారణాలపై సమగ్ర విచారణకు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్‌ జిందాల్‌, ఐపీఎస్‌ ఆదేశాలు, విచారణ అధికారిగా సౌత్‌ డివిజన్‌ ఎస్‌డీపీఓ శ్రీ జి. పూర్ణచంద్రరావు నియామకం, వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి గుంటూరు జిల్లా ఎస్పీకి నివేదిక సమర్పిస్తాం. జి. పూర్ణచంద్రరావు, డీఎస్పీ, సౌత్‌ సబ్‌ డివిజన్‌, గుంటూరు జిల్లా.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN