Guntur: 48 గంటల్లో వీధి దీపాల సమస్యల పరిష్కారం
Guntur: గుంటూరులో వీధి దీపాల సమస్యలపై అందిన ఫిర్యాదులను 48 గంటల్లో పరిష్కరిస్తామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి.
Guntur: 48 గంటల్లో వీధి దీపాల సమస్యల పరిష్కారం
గుంటూరు: గుంటూరు నగరంలో వీధి దీపాలకు సంబంధించి ప్రజల నుండి అందిన ప్రతి ఫిర్యాదునూ 48 గంటల్లో పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ద్వారా నగరంలో రాత్రి సమయాల్లో ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వీధి దీపాల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేశామని, అందులో భాగంగా జిఎంసి కాల్ సెంటర్ కి, లేదా క్షేత్ర స్థాయి అధికారికి ఫిర్యాదు అందిన 48 గంటల్లోగా పరిష్కారం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఇప్పటికే నగరంలో 35 వేల ఎల్ఈడీ లైట్లు ఉన్నాయని, వాటికి సంబంధించి అవసరమైన డ్రైవర్లు, ఇతర సామాగ్రిని సిద్దంగా ఉంచామని తెలిపారు. ఫిర్యాదుని బట్టి డ్రైవర్లు మార్చడం, వైరింగ్ సమస్యలను సరిచేయడం వంటి పనులను టెక్నీషియన్లు ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నారన్నారు. సాయంత్రం వేళల్లో నగరంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ, పనిచేయని వీధి దీపాలను గుర్తించి ఉదయాన్నే బాగు చేయడం ద్వారా వీధి దీపాల వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.




