Guntur: యువ టెన్నిస్ క్రీడాకారుడికి ఎస్బీ డీఎస్పీ చేయూత: క్రీడా సామగ్రి పంపిణీ

Guntur: టెన్నిస్ క్రీడలో రాణిస్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు షేక్ అఖియార్ అహ్మద్‌కు గుంటూరు ఎస్బీ డీఎస్పీ అలహరి శ్రీనివాస్ క్రీడా సామగ్రి అందజేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 17 Sept 2026 9:12 PM IST
Guntur
X

Guntur: యువ టెన్నిస్ క్రీడాకారుడికి ఎస్బీ డీఎస్పీ చేయూత: క్రీడా సామగ్రి పంపిణీ

Guntur: టెన్నిస్ క్రీడలో ప్రతిభ కనబరుస్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎస్.కె. మొయిద్దీన్ భాష కుమారుడు షేక్ అఖియార్ అహ్మద్ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈరోజు గుంటూరు స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ అలహరి శ్రీనివాస్ టెన్నిస్ రాకెట్‌తో పాటు టెన్నిస్ బ్యాగ్, బాల్స్‌ను అందజేశారు.

వచ్చే నెల 11, 12 తేదీలలో కాకినాడ డీఎస్ఏ స్టేడియంలో జరగనున్న టెన్నిస్ పోటీలలో పాల్గొనేందుకు వెళ్తున్న షేక్ అఖియార్ అహ్మద్‌ను ఈ సందర్భంగా అధికారులు అభినందించి, పోటీలలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ-2 ఎ. మల్లికార్జునరావుతో పాటు స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పాల్గొని యువ క్రీడాకారుడికి శుభాకాంక్షలు తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN