Guntur: సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల కవాతు: ఎస్పీ వకుల్ జిందాల్

Guntur: గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరు, మన్నవ గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు.

SHAREEF, PONNURU
Published on: 29 Oct 2026 5:11 PM IST
Guntur
X

Guntur: సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల కవాతు: ఎస్పీ వకుల్ జిందాల్

గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు తో గుంటూరు జిల్లా పరిధిలో జరగనున్న ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పొన్నూరు మండలంలోని సున్నిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల్లో భద్రతాభావాన్ని కల్పించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు.

గురువారం పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణ కోడూరు గ్రామం, మన్నవ గ్రామం లో పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య , నోడల్ ఆఫీసర్ ci హైమారావు, పొన్నూరు రూరల్ ఎస్ ఐ వి.శ్రీహరి,చేబ్రోలు ఎస్ ఐ పర్యవేక్షణలో పొన్నూరు రూరల్ పోలీస్ సిబ్బంది, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) బలగాల సిబ్బందితో కలిసి కవాతు నిర్వహించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నియమావళి అమలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కవాతు చేపట్టారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు సూచించారు.

బ్రాహ్మణ కోడూరు గ్రామంలో పోలీస్ కవాతు ముగిసిన అనంతరం పోలీసు బలగాలు పొన్నూరు మండలంలోని మన్నవ గ్రామానికి చేరుకుని అక్కడ కూడా ఫ్లాగ్ మార్చ్ నిర్వయించారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది అన్నారు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU