Guntur: గుంటూరులో నవంబర్ 30, డిసెంబర్ 1న పింఛన్ల పంపిణీ

Guntur: గుంటూరులో నవంబర్ 30, డిసెంబర్ 1వ తేదీల్లోనే పింఛన్ల పంపిణీ; మారిన షెడ్యూల్‌పై అధికారులకు కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ టెలి కాన్ఫరెన్స్ ఆదేశాలు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 27 Nov 2026 9:22 PM IST
Guntur
X

Guntur: గుంటూరులో నవంబర్ 30, డిసెంబర్ 1న పింఛన్ల పంపిణీ

గుంటూరు: రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించిన మేరకు సామాజిక భద్రత పింఛన్లను నవంబరు 30, డిసెంబరు 1వ తేదీల్లో మాత్రమే పంపిణీ జరుగుతుందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పించను సొమ్మును విత్ డ్రా చేయుటకు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పింఛన్ల పంపిణీ షెడ్యూల్ మారిన అంశం గమనించాలని స్పష్టం చేశారు. నవంబరు 30, డిసెంబరు 1వ తేదీల్లో మాత్రమే పంపిణీ చేయాలని, ఈ మేరకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మునిసిపల్ కమిషనర్లు రూపొందించుకోవాలని ఆదేశించారు.

లబ్ధిదారులకు సమాచారం సక్రమంగా అందజేసి పింఛను ఆ రెండు రోజులలో తీసుకునే విధంగా చేయాలని ఆదేశించారు. స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సిబ్బంది అందరికీ స్పష్టమైన సూచనలు జారీ చేసి పర్యవేక్షించాలని అన్నారు. పంపిణీ సమయంలో యథావిధిగా నిర్దేశిత మార్గదర్శకాలు పాటించాలని చెప్పారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN