Guntur: ప్రతి మండలంలో సింగిల్ డెస్క్: కలెక్టర్ సాయికాంత్ వర్మ
Guntur: స్థానిక ఎన్నికల అభ్యర్థుల అనుమతుల కోసం ప్రతి మండలంతో పాటు జీఎంసీ, తెనాలి మున్సిపాలిటీల్లో సింగిల్ డెస్క్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశించారు.
Guntur: ప్రతి మండలంలో సింగిల్ డెస్క్: కలెక్టర్ సాయికాంత్ వర్మ
గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులకు అవసరమగు అనుమతుల కోసం ప్రతీ మండలంలో సింగిల్ డెస్క్ పనిచేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. ఇంకా ఎక్కడైనా ఏర్పాటు చేయకపోతే తక్షణం ఏర్పాటు చేయాలని అన్నారు. గుంటూరు నగర పాలక సంస్థ, తెనాలి పురపాలక సంఘంలోనూ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆదివారం ఉదయం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేయాలని అన్నారు.
ఎస్.ఎస్.టి బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ లు చురుగ్గా పనిచేయాలని చెప్పారు. రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలు పట్ల స్పష్టత కలిగి ఉండాలని ఆదేశించారు. ఎన్నికల సిబ్బంది, లెక్కింపు సిబ్బంది నియామకాలు వెంటనే పూర్తి చేసి శిక్షణ ఇవ్వాలని అన్నారు.
ఎన్నికల సాధారణ, వ్యయ, పోలీస్ పరిశీలకులు వస్తున్నారని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను గుర్తించినా, ఎన్నికలకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా ప్రశ్నలు ఉన్నా, వాటిపై ఫిర్యాదులు చేసేందుకు లేదా వివరాలు తెలుసుకునేందుకు 08632 234014 హెల్ప్డెస్క్/కాల్ సెంటర్ ఫోన్ నంబర్ కు ప్రజలు ఫోన్ చేసి సంప్రదించవచ్చని చెప్పారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.




