Guntur: గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీగా ఎస్. కాంతారావు బాధ్యతలు స్వీకరణ
Guntur: గుంటూరు నగర ట్రాఫిక్ డీఎస్పీగా ఎస్. కాంతారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు; జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Guntur: గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీగా ఎస్. కాంతారావు బాధ్యతలు స్వీకరణ
గుంటూరు: గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీగా ఎస్. కాంతారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాదపూర్వకంగా గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఐపీఎస్ ని కలిసి పూల మొక్కను అందజేశారు.
ఎస్. కాంతారావు 1995లో ఎస్‌ఐగా పోలీస్ శాఖలో ఎంపికై, విశాఖ జిల్లా లో వివిధ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించారు. 2010లో ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొంది, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. తాజాగా 2026లో డీఎస్పీగా పదోన్నతి పొంది గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
గుంటూరు నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేకంగా కృషి చేస్తానని డీఎస్పీ ఎస్. కాంతారావు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు ఉన్న ప్రాంతాలను ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తే, వాటిని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి, మున్సిపల్ కమిషనర్ మరియు సంబంధిత శాఖల అధికారుల సహకారంతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ట్రాఫిక్ వ్యవస్థ అందించేందుకు సమన్వయంతో పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.




