Guntur: భవిష్యత్ గ్లోబల్ ఇండస్ట్రీస్‌లో సాంకేతిక పరిజ్ఞానమే కీలకం!
Guntur: గుంటూరు ఆర్‌వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఇండస్ట్రీ రెడీనెస్‌పై నిర్వహించిన సెమినార్‌లో ఐటీసీ జనరల్ మేనేజర్ దేబాశిష్ హైత్ కీలకోపన్యాసం చేశారు.
Guntur: భవిష్యత్ గ్లోబల్ ఇండస్ట్రీస్‌లో సాంకేతిక పరిజ్ఞానమే కీలకం!
గుంటూరు: ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో రాణించాలంటే విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవాలని ఐటీసీ లిమిటెడ్ (అగ్రి బిజినెస్ డివిజన్) జనరల్ మేనేజర్ (హెచ్.ఆర్. & ఓ.డి.) శ్రీ దేబాశిష్ హైత్ పేర్కొన్నారు.
ఆర్.వి.ఆర్. & జె.సి. ఇంజినీరింగ్ కళాశాలలో కళాశాల మేనేజ్మెంట్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో “ఇండస్ట్రీ రెడీనెస్ : స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ ఫర్ ఫ్యూచర్ మేనేజర్స్” అనే అంశంపై నిర్వహించిన సెమినార్ కార్యక్రమానికి దేబాశిష్ హైత్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచ పారిశ్రామిక రంగంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు, మేనేజ్‌మెంట్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులు, యువ మేనేజర్లకు అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఆధునిక సాంకేతికతలు ప్రపంచ వ్యాపార రంగాన్ని కొత్త దిశగా నడిపిస్తున్నాయని, ఈ మార్పులకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకున్న విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విస్తృతమైన ఉద్యోగ, వ్యాపార, స్టార్టప్ అవకాశాలు లభిస్తాయని కళాశాల అధ్యక్షులు డా. రాయపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీ జాగర్లమూడి మురళీమోహన్, డా.జగదీష్ కె.మద్దినేని పేర్కొన్నారు.
తమ కళాశాలలోని మేనేజ్‌మెంట్ సైన్సెస్ విభాగంలో బి.బి.ఏ., ఎం.బి.ఏ. కోర్సులకు ఏఐ & డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్ & డేటా మేనేజ్‌మెంట్, డిజిటల్ లాజిస్టిక్స్ & సప్లై చైన్ మేనేజ్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్ వంటి సాంకేతిక ఆధారిత కోర్సులను అనుసంధానిస్తూ, ఇండస్ట్రీ 4.0 కు అనుగుణంగా కరిక్యులంను రూపొందించి, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ&కరెస్పాండెంట్ శ్రీ రాయపాటి గోపాల కృష్ణ, ట్రెజరర్ డా. కొండబోలు కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.కొల్లా శ్రీనివాస్, కళాశాల అకడమిక్ అండ్ ఆర్&డి డైరెక్టర్ డా. కె.రవీంద్ర, కళాశాల డైరెక్టర్ ఫైనాన్స్ & అడ్మినిస్ట్రేషన్ డా.ఎన్.వి. శ్రీనివాస రావు, కళాశాల మేనేజ్మెంట్ సైన్సెస్ విభాగ డీన్ బాల నాగేశ్వర రావు, విభాగాధిపతి డా.టి. శ్రీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.




