Guntur: లింగేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 11.81 లక్షలు

Guntur: పొన్నూరు శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన హుండీ లెక్కింపు. రూ. 11,81,781 ఆదాయం వచ్చినట్లు వెల్లడించిన ఈవో నిడమానూరి శ్రీనివాసరావు.

SHAREEF, PONNURU
Published on: 28 Sept 2026 5:48 PM IST
Guntur
X

Guntur: లింగేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 11.81 లక్షలు

గుంటూరు: పొన్నూరు పట్టణం నందు వెంచేసియున్న శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి మరియు శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయము నందు ది 28.09.26 సోమవారము ఉదయము గం 9.00 లకు దేవస్థానములోని హుండీ లెక్కింపు కార్యక్రమము.

దేవాదాయశాఖకు చెందిన ములుకుదురు గ్రూప్ టెంపుల్స్ ఈవో నిడమానూరి శ్రీనివాసరావు పర్యవేక్షణలో లెక్కింపు జరగగా రు 11,81,781/- లు వచ్చినవి.

ఈ కార్యక్రమము నందు కార్యనిర్వాహధికారి ఆరికాటి శ్రీనివాసరావు మరియు చైర్మన్ జి.ఎమ్ఎ.స్ గుప్తా, ధర్మకర్త సభ్యులు కత్తుల రవికిరణ్, టి.శ్రీలక్ష్మి, కే.విజయలక్ష్మి, ch. రాంబాబు పాల్గొన్నారు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU