Gaddipadu: గడ్డిపాడు ఆర్వోబీ పనుల శంకుస్థాపన: కమిషనర్ మయూర్ అశోక్

Gaddipadu: గుంటూరు గడ్డిపాడు రైల్వే గేటు వద్ద సెప్టెంబర్ 26న జరగనున్న ఆర్వోబీ శంకుస్థాపన ఏర్పాట్లను నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ పరిశీలించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 24 Sept 2026 7:00 PM IST
Gaddipadu
X

Gaddipadu: గడ్డిపాడు ఆర్వోబీ పనుల శంకుస్థాపన: కమిషనర్ మయూర్ అశోక్

Guntur: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని గడ్డిపాడు రైల్వే గేటు దగ్గర ఈ నెల 26న రైల్వే ఓవర్ బ్రిడ్జి శంఖుస్థాపన కార్యక్రమ విజయవంతానికి జిఎంసి నుండి తగిన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు.

గురువారం గడ్డిపాడు రైల్వే గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంఖుస్థాపన జరగనున్న నేపధ్యంలో శంఖుస్థాపన, సభావేదిక ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శిలాఫలకం, సభావేదిక ఏర్పాట్లను రైల్వే అధికారులు నిర్దేశిత ప్రొటోకాల్ మార్గదర్శకాల మేరకు సిద్దం చేస్తారని, జిఎంసి వైపు నుండి కార్యక్రమం జరిగే ప్రాంతంలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.

మెయిన్ రోడ్ లోని ప్యాచ్ వర్క్ లను చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను, సెంట్రల్ డివైడర్లలోని మొక్కలకు ట్రిమ్మింగ్ చేయాలని ఉద్యానవిభాగ అధికారులను ఆదేశించారు. అనధికార హోర్డింగ్స్, పోస్టర్స్ తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.

పర్యటనలో జిఎంసి ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, రైల్వే ఏడీఎన్ సతీష్ అధికారులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN