Guntur: నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలు వద్దంటూ గుంటూరులో నిరసన!
Guntur: గుంటూరు పొన్నూరు రోడ్డు చంద్రబాబు కాలనీ నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణం ఏర్పాటుపై ఆగ్రహం. అనుమతులు రద్దు చేయాలని 300 మందితో భారీ పాదయాత్ర!
Guntur: నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలు వద్దంటూ గుంటూరులో నిరసన!
Guntur: గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్డులో చంద్రబాబు నాయుడు కాలనీ సమీపంలో ప్రజలు నివసించే ప్రాంతంలో మద్యం దుకాణం నిర్మాణం జరుగుతున్నట్టు గుర్తించిన స్థానిక ప్రజలు, ఆ మద్యం దుకాణానికి ప్రభుత్వం ఎటువంటి లైసెన్సులు ఇవ్వకూడదని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆంధ్రా ముస్లిం కాలేజీ సమీపం నుంచి చంద్రబాబు నాయుడు కాలనీ వరకు పాదయాత్ర నిర్వహించారు.
పాదయాత్ర అనంతరం జరిగిన సమావేశానికి ఆవాజ్ జిల్లా నాయకులు షేక్ అబ్దుల్ సలీమ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా సెక్రెటరీ అరుణ మాట్లాడుతూ, మద్యం వల్ల ఎన్నో జీవితాలు నాశనమవుతున్నాయని అన్నారు. చిన్నాచితక పనులు చేసుకుని జీవించే అనేక మంది మద్యానికి అలవాటుపడి, కుటుంబ కలహాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు.
ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ చిస్తి మాట్లాడుతూ, కలెక్టర్‌కు ఇప్పటికే రెండుసార్లు అభ్యంతర పత్రాలు అందజేశామని, ఎమ్మెల్యేను కూడా కలిసి ఈ అంశంపై చర్చించామని తెలిపారు. అధికారులు తగిన చర్యలు తీసుకుని స్థానికంగా బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు ఎటువంటి లైసెన్సులు రాకుండా చూడాలని కోరారు. లేనిపక్షంలో నివాస ప్రాంతాల్లో బార్‌ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రజలందరినీ కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
స్థానికులు షేక్ నసీర్ అహ్మద్, షేక్ ముజ్జకీర్, పి. రియాజ్ ఖాన్ Sk. ఖాదర్ భాష తదితరులు ఈ కార్యక్రమంలో ముందుండి పాల్గొన్నారు. ఆంధ్రా ముస్లిం కాలేజీ నుంచి చంద్రబాబు నాయుడు కాలనీ వరకు జరిగిన ఈ పాదయాత్రలో సుమారు 300 మంది స్థానికులు పాల్గొన్నారు.




