Prathipadu: నూతన ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సత్కరించిన బలసాని కిరణ్!
Prathipadu: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీ సభ్యులను సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ సత్కరించారు.
Prathipadu: నూతన ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సత్కరించిన బలసాని కిరణ్!
ప్రత్తిపాడు: గుంటూరు రూరల్ మండలం, ఏటుకూరు బైపాస్ రోడ్డులో గల, ప్రత్తిపాడు నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన M.P.T.C (మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ) సభ్యులుగా, ఘన విజయం సాధించిన నూతన ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించిన, ప్రత్తిపాడు నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త "శ్రీ బలసాని కిరణ్ కుమార్" గారు.
మరియు విజయం సాధించిన వారు, తమకు MPTC (మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు) లుగా సేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతగా "బలసాని" గారికి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా సేవలో ముందుంటామని అన్నారు. అనంతరం, బలసాని గారు మాట్లాడుతూ, ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామాల అభివృద్ధికి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు.




