Guntur: గుంటూరులో డ్రగ్స్‌పై ‘సంకల్పం’ అవగాహన సదస్సు!
Guntur: గుంటూరు ఈస్ట్ డీఎస్పీ టీ. సీతారామ్ ఆధ్వర్యంలో వడ్డరగూడెంలో సంకల్పం – డ్రగ్స్ అవగాహన సదస్సు. డ్రగ్స్ రహిత సమాజం కోసం పోలీస్ శాఖ పిలుపు.
Guntur: గుంటూరులో డ్రగ్స్‌పై ‘సంకల్పం’ అవగాహన సదస్సు!
Guntur: జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు, ఈస్ట్ డీఎస్పీ టీ. సీతారామ్ ఆధ్వర్యంలో గుంటూరు సంగడిగుంట ప్రాంతంలోని వద్దరగూడెంలో పోలీసులు ‘సంకల్పం – డ్రగ్స్ అవగాహన’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి, విద్య, క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ అక్రమ విక్రయాలు, సరఫరా గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.




