Guntur: గుంటూరులో ఈగల్ టీం ‘వజ్ర పహార్’ కార్డెన్ సెర్చ్!
Guntur: గుంటూరు రామిరెడ్డి తోటలో ఈగల్ టీం ‘వజ్ర పహార్’ కార్డెన్ సెర్చ్. గంజాయి అరికట్టడమే లక్ష్యం, సరైన పత్రాలు లేని 41 వాహనాలు స్వాధీనం.
Guntur: గుంటూరులో ఈగల్ టీం ‘వజ్ర పహార్’ కార్డెన్ సెర్చ్!
Guntur: నగరంలో గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ టీం ఆధ్వర్యంలో ‘వజ్ర పహార్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని రామిరెడ్డి తోటలో ఈగల్ టీం, ఈస్ట్ డీఎస్పీ సీతారాం ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసులు కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 112 లేదా 1972 నంబర్లకు సమాచారం అందించాలని ఈస్ట్ డీఎస్పీ సీతారాం ప్రజలను కోరారు. విద్యార్థి దశ నుంచే కొందరు యువత గంజాయికి అలవాటు పడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం కాలనీ ప్రజలతో కలిసి గంజాయి, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.




