Guntur: రైతు బజార్‌లో లక్ష్మీ అపర్ణ విస్తృత ప్రచారం!
Guntur: గుంటూరు మేయర్ ఎన్డీఏ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ కృష్ణానగర్ రైతు బజార్‌లో ప్రచారం చేసి, సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
Guntur: రైతు బజార్‌లో లక్ష్మీ అపర్ణ విస్తృత ప్రచారం!
Guntur: గుంటూరు నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ కృష్ణానగర్‌లోని రైతు బజార్‌ను సందర్శించి ప్రచారం నిర్వహించారు. నవంబర్ 1న జరిగే పోలింగ్‌లో బ్యాలెట్‌పై సైకిల్ గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి తనను మేయర్‌గా, కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నగర అభివృద్ధికి కూటమికి అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా లక్ష్మీ అపర్ణ మాట్లాడుతూ రైతులు, వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే రైతు బజార్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మానసపుత్రిక అని పేర్కొన్నారు.
కృష్ణానగర్ రైతు బజార్‌లో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో రెండు అంతస్తుల భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని, నిర్మాణ పనులు కొన్ని నెలల్లో పూర్తవుతాయని అన్నారు. జరుగుతున్న అభివృద్ధికి కొనసాగింపుగా కూటమి ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు.




