Guntur: ఈ నెల 25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

Guntur: గుంటూరులో ఈ నెల 25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. 1 నుంచి 19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు జేసీ వెల్లడి.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 17 Sept 2026 7:25 AM IST
Guntur
X

Guntur: ఈ నెల 25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

గుంటూరు: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఈ నెల 25వ తేదీన నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంపై జిల్లా సమన్వయ సమావేశం బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. “జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం"

లో బాగంగా జిల్లాలో గల 1 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల దాదాపు 4,62,714 మంది బాల బాలికలకు అంగన్వాడీ, ప్రభుత్వ , ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలలో చదివే విద్యార్దిని విద్యార్దులకు, విద్యా సంస్థల బయట ఉన్న వారికి, కౌమార బాల బాలికలకు నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రాలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని వివరించారు.

ఈ మాత్రలు 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాలు వయస్సు గల పిల్లలకు సగము మాత్రను నీటిలో కరిగించి త్రాగించాలన్నారు. 2 నుండి 3 సంవత్సరాల వయసు గల పిల్లలకు పూర్తి మాత్రను నీటిలో కరిగించి త్రాగించాలని, 3 నుండి 19 సంవత్సరాల వయసు గల వారికి పూర్తి మాత్రను చప్పరించేటట్లు చూడాలన్నారు. మద్యాహ్నం భోజనం చేసిన అర గంట తరవాత మాత్రలను వేయాలని సూచించారు.

విద్యాశాఖ, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. నులి పురుగుల నివారణ వలన రక్త హీనత వంటి సమస్యలను అధిగమించుటకు అవకాశం ఉందని గ్రహించాలని సూచించారు. ప్రతీ ఒక్కరికి నిర్దేశిత మోతాదులో ఆల్బెండజోల్ మాత్రాలను అందించాలన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి మాట్లాడుతూ మాత్రను చప్పరించడం వలన ఎటువంటి దుష్పరిణామాలు కలుగవని అన్నారు. 25వ తేదీన తీసుకొనని వారికి అక్టోబర్ 5వ తేదీన జరిగే మాప్ అప్ రౌండ్ కార్యక్రమంలో మాత్రలను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఎటువంటి అస్వస్థతకు గురైన సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి తగు చికిత్స పొందవచ్చని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జె.పార్థసారథి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.జి.ప్రసూన, ఇంటర్మీడియట్ విద్యా శాఖ ప్రాంతీయ పర్యవేక్షక అధికారి జి.సునీత, వైద్య ఆరోగ్య శాఖ డి.పి.ఎం.ఓ డా. సుజాత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN