Guntur: దీపావళి నాటికి నందివెలుగు రోడ్డు ఆర్ఓబీ అందుబాటులోకి
Guntur: గుంటూరు నందివెలుగు రోడ్ ఆర్ఓబీ పనులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. దీపావళి నాటికి వంతెనను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
Guntur: దీపావళి నాటికి నందివెలుగు రోడ్డు ఆర్ఓబీ అందుబాటులోకి
గుంటూరు: దీపావళి నాటికి నందివెలుగు రోడ్ ఆర్ఓబి ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా పనుల వేగవంతం...కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
2013-14లో మంజూరై, 2017లో పనులు ప్రారంభమై గత పదేళ్లుగా నిలిచిపోయిన నందివెలుగు రైల్వే వంతెన పనులను పునరుద్ధరించి, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేశామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, రైల్వే, జిఎంసి, ఆర్&బి అధికారులతో కలిసి నందివెలుగు రోడ్ లోని ఆర్ఓబి నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తొలుత ఇప్పటి వరకు జరిగిన పనులు, పెండింగ్ పనులపై అధికారులను, కాంట్రాక్టర్ ని వివరాలు అడిగి తెలుసుకొని, మాట్లాడుతూ, సుదీర్ఘకాలం నిలిచిపోయిన ఆర్ఓబీ పనులన్నింటినీ దాదాపు రూ.39 కోట్లతో రీ-టెండర్ నిర్వహించి పనులను పునఃప్రారంభించామన్నారు. ప్రస్తుతం పనులన్నీ తుది దశకు చేరుకున్నాయని, దాదాపు దీపావళి సమయానికి వంతెనను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
పనుల్లో ఎదురవుతున్న గ్రావెల్ కొరత, ఒకవైపు ఉన్న గుడి వద్ద ట్రాఫిక్ సమస్యలను స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ క్లియర్ చేస్తున్నామని తెలిపారు. అలాగే పనుల నిమిత్తం రైల్వే గేట్‌ను రెండు రోజుల పాటు మూసివేసి పనులు పూర్తి చేయడంతో పాటు, మున్సిపల్ కార్పొరేషన్ సహాయంతో బ్రిడ్జి కింది ప్రాంతాన్ని సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు డిసెంబర్ 15 వరకు గడువు కోరినప్పటికీ, అదనపు సిబ్బందిని లేదా సబ్-కాంట్రాక్టర్లను ఉపయోగించి అంతకంటే ముందే పనులను ఫాస్ట్ ట్రాక్ చేసి పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.




