Guntur: వార్డుల పునర్విభజనపై సంగడిగుంట ముస్లింల ఆందోళన

Guntur: గుంటూరు తూర్పులో సంగడిగుంట పెద్ద మసీదును వేరే వార్డులో మార్చడాన్ని నిరసిస్తూ ముస్లింలు శుక్రవారం జుమ్మా నమాజ్ అనంతరం శాంతియుత నిరసన తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 9 Oct 2026 9:19 PM IST
Guntur
X

Guntur: వార్డుల పునర్విభజనపై సంగడిగుంట ముస్లింల ఆందోళన

గుంటూరు: గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సంగడిగుంట పాత 13వ వార్డును ఇప్పుడు కొత్త 22వ వార్డుగా మార్చి, సంగడిగుంటలో పాత చెక్కల బజార్ వద్ద 1946 నుండి ఉన్న చారిత్రాత్మక పెద్ద మసీదు (బడి మసీద్) ను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా డీఎస్ నగర్ వార్డులో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం జుమ్మా నమాజ్ అనంతరం సంగడిగుంట పెద్ద మసీదు వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు గుంటూరు మున్సిపల్ కమిషనర్ పెద్ద మసీదు మత పెద్దలకు, స్థానిక సంగడిగుంట ముస్లిం ప్రజలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ఏకపక్షంగా వార్డులను మార్చడం ఇష్టారాజ్యంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

1946 నుండి సంగడిగుంట గుర్తింపుగా, మా మతపరమైన, సాంస్కృతిక కేంద్రంగా ఉన్న పెద్ద మసీదును సంగడిగుంట నుండి వేరు చేయడం సరికాదు. "మా సంగడిగుంట గుర్తింపు - మా పెద్ద మసీదు" అని, మసీదును తిరిగి పాత 13వ వార్డు (ప్రస్తుత సంగడిగుంట వార్డు పరిధిలోనే) కొనసాగించాలని డిమాండ్ చేస్తూ "దిల్ సే హమారా సంగడిగుంట - బడి మసీద్ హమారా" అనే కార్యక్రమంతో స్థానిక ముస్లిం ప్రజల మద్దతుతో భారీ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

మా ప్రధాన డిమాండ్లు:

1. 1946 నాటి చారిత్రాత్మక సంగడిగుంట పెద్ద మసీదును డీఎస్ నగర్ వార్డు నుండి తొలగించి, తిరిగి సంగడిగుంట పాత 13వ వార్డు పరిధిలోనే కొనసాగించాలి.

2. వార్డుల పునర్విభజనలో స్థానిక మత పెద్దలు, ప్రజల అభిప్రాయం తీసుకోవాలి.

3. సంగడిగుంట ముస్లిం ప్రజల మనోభావాలను గౌరవించాలి.

తక్షణమే మా డిమాండ్ నెరవేర్చకపోతే సంగడిగుంట ముస్లిం ప్రజలందరం ఏకమై పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సంగడిగుంట పెద్ద మసీదు మత పెద్దలు, స్థానిక ముస్లిం ప్రజలు, యువత విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN