Guntur: ఈ నెల 28న పోలింగ్, 30న కౌంటింగ్: కమీషనర్ మయూర్ అశోక్!

Guntur: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గుంటూరు నగరంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రకటించారు. 28న పోలింగ్.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 14 Oct 2026 4:58 PM IST
Guntur
X

Guntur: ఈ నెల 28న పోలింగ్, 30న కౌంటింగ్: కమీషనర్ మయూర్ అశోక్!

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ని బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తరుణంలో, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని, నగరంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) తక్షణమే (14వ తేదీ) అమల్లోకి వచ్చిందన్న కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె.మయూర్ అశోక్.

నామినేషన్ల స్వీకరణ: ఈ నెల 16వ తేదీ నుండి 18 వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, 19న నామినేషన్ల స్క్రూట్నీ

నామినేషన్ల ఉపసంహరణ గడువు: ఈ నెల 21 మధ్యాహ్నం 3 గంటల వరకు, 3 గంటల తర్వాత పోటీ చేయు అభ్యర్ధుల జాబితా ప్రచురణ

పోలింగ్ తేదీ: ఈ నెల 28

ఓట్ల లెక్కింపు (కౌంటింగ్): ఈ నెల 30న

ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారని, గుంటూరు నగర ఓటర్లందరూ తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకుని, ఎన్నికల ప్రక్రియ విజయవంతం కావడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నామన్న కమిషనర్.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN