Guntur: మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంగా పనిచేయాలి

Guntur: గుంటూరులో టీడీపీ కార్యకర్తల గ్రీవెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి. మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా పనిచేయాలని పిలుపు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 17 Sept 2026 7:15 AM IST
Guntur
X

Guntur: మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంగా పనిచేయాలి

గుంటూరు: రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ రెండు ఏళ్లలోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశాం కాబట్టి గర్వంగా ప్రజలను ఓటు అడుగుదామని, దానికి పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు.

బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి కార్యకర్తల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి, పార్టీ శ్రేణుల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ డివిజన్లకు చెందిన కార్యకర్తలు తమ ప్రాంతాల్లోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ...

గతంలో వైసీపీ కార్పొరేటర్లు అభివృద్ధిని, ప్రజలను విస్మరించి, దోపిడికి పాల్పడ్డారని విమర్శించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకుని కోట్లాది రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రెండు ఏళ్లలోనే ఎన్నో చేశాం గర్వంగా ఓటు అడుగుదాం అని, ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసేలా పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతానికి సమష్టిగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN