Guntur: కొరిటెపాడు వాకింగ్ ట్రాక్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

Guntur: గుంటూరు కొరిటెపాడు వాకింగ్ ట్రాక్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి. ట్రాక్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 25 Sept 2026 8:24 PM IST
Guntur
X

Guntur: కొరిటెపాడు వాకింగ్ ట్రాక్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

గుంటూరు: గుంటూరు కొరిటెపాడు వాకింగ్ ట్రాక్ వైభవాన్ని మరింత పెంచాలని, నూతనంగా ఎన్నికయిన కొరిటెపాడు వాకింగ్ ట్రాక్ సభ్యులను సూచించారు. శుక్రవారం గుంటూరు కొరిటెపాడు వాకింగ్ ట్రాక్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నూతన కమిటీగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ... కొరిటెపాడు వాకింగ్ ట్రాక్ పశ్చిమ నియోజకవర్గంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వాకింగ్ ట్రాక్‌లలో ఒకటిగా గుర్తింపు పొందిందని, సుమారు 800 మీటర్ల పొడవుతో ఉన్న ఈ ట్రాక్ గత 25 ఏళ్లుగా వేలాది మందికి ఆరోగ్యం, ఆనందాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

సింగంశెట్టి కోటేశ్వరరావు ఎంతో కష్టపడి, నిజాయితీగా పని చేసే వ్యక్తి అని, ట్రాక్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. కమిటీ సభ్యులందరూ సమిష్టిగా సహకరించి ట్రాక్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు పెద్దలు ట్రాక్ వద్ద బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం, వెనుక వైపు గేటు కారణంగా ఏర్పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడం వంటి సూచనలు చేశారని, వాటిని పరిశీలించి సాధ్యమైన మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కొత్త కమిటీ స్థానిక సమస్యలను పరిష్కరించుకుంటూనే ట్రాక్ అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను తమ దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు సహకరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో అందరి సహకారంతో కొరిటెపాడు వాకింగ్ ట్రాక్‌ను మరింత అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తామని తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN