Guntur: కలంతో సమానత్వాన్ని చాటిన కవి జాషువా: ఎమ్మెల్యే రామాంజనేయులు

Guntur: గుంటూరులో నిర్వహించిన కవి కోకిల గుర్రం జాషువా 131వ జయంతి సభలో పాల్గొని జాషువా సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 26 Sept 2026 6:42 PM IST
Guntur
X

Guntur: కలంతో సమానత్వాన్ని చాటిన కవి జాషువా: ఎమ్మెల్యే రామాంజనేయులు

Guntur: గుంటూరు, సంతోష్ నగర్,1 లైన్, కార్డ్స్ ఆర్నాల్డ్ పౌలస్ ఆడిటోరియం నందు కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 131 వ జయంతి సందర్భంగా జాషువ కల్చరల్ సెంటర్ వారి ఆధ్వర్యంలో జాషువా సాహితీ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా మానవత్వమే మహోన్నతమని తన సాహిత్యం ద్వారా చాటిన మహాకవి గుర్రం జాషువా అని, ఆయన రచనలు అణగారిన వర్గాల్లో ఆత్మగౌరవాన్ని, సామాజిక చైతన్యాన్ని నింపాయని,జాషువా కలం కేవలం కవిత్వాన్ని సృష్టించలేదని, సమాజాన్ని ప్రశ్నించే చైతన్యాన్ని, సమానత్వాన్ని కోరే స్వరాన్ని, మానవత్వాన్ని కాపాడే సందేశాన్ని అందించిందని అన్నారు.

ఆయన సాహిత్యం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సాహిత్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి జాషువా సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.

సాహిత్యాన్ని, తెలుగు భాషను, జాషువా ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేస్తున్న కృషిని ఎమ్మెల్యే అభినందించారు.జాషువా ఆశయాలను, సాహితీ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు జాషువా కల్చరల్ సెంటర్ నిర్వహిస్తున్న , కళారత్న పి.వి రమణ కృషి అభినందనీయమని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఎమ్మెల్యే హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాషువా అభిమానులు, విద్యార్థులు, మరియు తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN