Guntur: గుంటూరులో వట్టికూటి వెంకటసుబ్బయ్య వర్ధంతి, మేయర్ నివాళి

Guntur: గుంటూరు స్తంభాలగరువు మహాప్రస్థానంలో వట్టికూటి వెంకటసుబ్బయ్య 25వ వర్ధంతిలో మేయర్ లక్ష్మీ అపర్ణ పాల్గొన్నారు. రూ.50 లక్షల నిధులపై హామీ.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 29 Nov 2026 6:21 PM IST
Guntur
X

Guntur: గుంటూరులో వట్టికూటి వెంకటసుబ్బయ్య వర్ధంతి, మేయర్ నివాళి

గుంటూరు: గుంటూరులోనే కాకుండా రాష్ట్రంలోని అనేక మహాప్రస్థానాల ఆధునీకరణ ఆలోచనలు చేసిన కీర్తిశేషులు వట్టికూటి వెంకటసుబ్బయ్య 25వ వర్ధంతి కార్యక్రమం ఆదివారం స్తంభాలగరువులోని మహాప్రస్థానంలో జరిగినది.ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ లక్ష్మీ అపర్ణ కోవెలమూడి వెంకటసుబ్బయ్య,గుమ్మడి రాధాకృష్ణమూర్తి ల విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ నిష్కామ కర్మయోగి వట్టికూటి వెంకటసుబ్బయ్య అన్నారు.ఆయన ఆలోచనలతోనే గుమ్మడి రాధాకృష్ణ అనేక మహాప్రస్థానాలను ఆధునికరించారన్నారు. ఇంకా మరిన్ని సేవలను ముందుకు తీసుకు వెళ్లే బాధ్యత కమిటీపై ఉందన్నారు.

నగరపాలక సంస్థ మహాప్రస్థానాల అభివృద్ధికి హామీ ఇచ్చిన 50 లక్షల రూపాయలను త్వరలోనే కమిటీలో చర్చించి ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు సేవా సమితి అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు కామేపల్లి రత్నబాబు తోనుగుంట్ల సుందర రామయ్య,ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ అంకమ్మ చౌదరి,వల్లూరి తాండవ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN