Guntur: గుంటూరు మేయర్ లక్ష్మీ అపర్ణకు ఎమ్మెల్యే బూర్ల అభినందనలు
Guntur: గుంటూరు మేయర్‌గా గెలిచిన లక్ష్మీ అపర్ణ కోవెలమూడి ని కలిసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేత.
Guntur: గుంటూరు మేయర్ లక్ష్మీ అపర్ణకు ఎమ్మెల్యే బూర్ల అభినందనలు
గుంటూరు: గుంటూరు నగర మేయర్‌గా అఖండ మెజారిటీతో విజయం సాధించిన లక్ష్మీ అపర్ణ కోవెలమూడి ని, ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు నేడు మేయర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అపర్ణ ఘన విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ, బూర్ల రామాంజనేయులు ఆమెను శాలువాతో సత్కరించి, ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎన్నికల సమయంలో తనకు వెన్నుదన్నుగా నిలిచి, విజయానికి విలువైన సహాయ సహకారాలు అందించిన బూర్ల రామాంజనేయులు కి అపర్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలు అందించిన విజయాన్ని అభివృద్ధికి పునాదిగా మలుస్తూ, గుంటూరు నగర ప్రగతికి అందరి సహకారంతో ముందుకు సాగాలనే ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.




