Guntur: గుంటూరు మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణకు భారీ మెజారిటీ ఖాయం!

Guntur: గుంటూరు మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ కోవెలమూడి 1వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, కూటమి నాయకులు పాల్గొని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 22 Oct 2026 11:18 AM IST
Guntur
X

Guntur: గుంటూరు మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణకు భారీ మెజారిటీ ఖాయం!

Guntur: గుంటూరు నగర మేయర్ అభ్యర్థి శ్రీమతి లక్ష్మీ అపర్ణ కోవెలమూడికి మద్దతుగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఇందులో భాగంగా 1వ వార్డు కార్పొరేటర్ కోట పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ కోవెలమూడి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలను కలుసుకుంటూ లక్ష్మీ అపర్ణ కోవెలమూడికి మద్దతు ఇవ్వాలని కోరారు. నగర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి కట్టుబడి ఉందని వివరించారు. ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు.గుంటూరు తూర్పు నియోజకవర్గంలో లక్ష్మీ అపర్ణ కోవెలమూడికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కూటమి నాయకులు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఆమె భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో 1వ వార్డు కార్పొరేటర్ కోట పిచ్చిరెడ్డి, వార్డు అధ్యక్షురాలు మువ్వా, క్లస్టర్ ఇన్‌ఛార్జి అన్వర్, జనసేన నాయకుడు దిలీప్ తోట, దాసరి శ్రీను, రూబెన్, సుభానీ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN