Guntur: డిసెంబర్ 7న గుంటూరులో మహా రుద్రాభిషేకం: జూపూడి రంగరాజు!

Guntur: ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7న గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మహా రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు జూపూడి రంగరాజు తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 17 Nov 2026 12:55 PM IST
Guntur
X

Guntur: డిసెంబర్ 7న గుంటూరులో మహా రుద్రాభిషేకం: జూపూడి రంగరాజు!

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహా రుద్రాభిషేకం డిసెంబర్ 7న గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుందని బీజేపీ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది జూపూడి రంగరాజు తెలిపారు.

మంగళవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి అఘోర్ అఖాడా ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ డా. రాజేష్ నాథ్ జీ అఘోరి హాజరుకానున్నట్లు చెప్పారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్స్ ను చేశారు. కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, 41వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ గాయత్రి బెహరా, పలువురు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN