Guntur: సీనియర్ జర్నలిస్ట్ సూర్య నాయక్‌ను పరామర్శించిన మాదల చైతన్య
Guntur: గుంటూరులో రోడ్డు ప్రమాదంలో గాయపడిన సీనియర్ జర్నలిస్ట్ సూర్య నాయక్‌ను జన చైతన్య గ్రూప్ అధినేత మాదల చైతన్య పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు.
Guntur: సీనియర్ జర్నలిస్ట్ సూర్య నాయక్‌ను పరామర్శించిన మాదల చైతన్య
గుంటూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న గుంటూరు జిల్లా సీనియర్ జర్నలిస్ట్ నాయక్ ను జన చైతన్య గ్రూపు అధినేత, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాదల చైతన్య శనివారం అరండల్ పేటలో ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, వైద్యులు సూచించిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరంకుటుంబ సభ్యులతో మాట్లాడిన మాదల చైతన్య... నాయక్ ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం తీసుకుంటున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి సాధారణ జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు..
ఆర్థిక సహాయం అందజేత
సూర్య నాయక్ అనారోగ్య పరిస్థితిని తెలుసుకున్న మాదల చైతన్య తన వంతు సహాయంగా రూ 25,000 ఆర్థిక సహాయం అందజేశారు. కష్టకాలంలో ఉన్న వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాదల చైతన్య మాట్లాడుతూ...సమాజం కోసం నిరంతరం పనిచేసే జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అలాంటి సీనియర్ జర్నలిస్ట్ సూర్య నాయక్ రోడ్డు ప్రమాదానికి గురికావడం బాధాకరమన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవసరమైన సమయంలో నా వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు..
జర్నలిస్టుల సేవలు అభినందనీయం
ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని మాదల చైతన్య పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులకు సమాజం ఎల్లప్పుడూ అండగా ఉండాలని అన్నారు.సూర్య నాయక్ త్వరగా కోలుకుని మళ్లీ తన వృత్తి బాధ్యతల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం కుదుటపడే వరకు కుటుంబ సభ్యులు, మిత్రులు ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా సూర్య నాయక్ కుటుంబ సభ్యులు మాదల చైతన్యకు కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యం సమయంలో కష్ట కాలంలో పరామర్శించి, ఆర్థిక సహాయం అందించడం పట్ల తమ కుటుంబానికి ఎంతో ధైర్యం కలిగిందని పేర్కొన్నారు.. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ చెవుల కృష్ణాఆంజనేయులు , ఆధునిక ఆసుపత్రి డెవలప్మెంట్ కోఆర్డినేటర్ పంతగాని యోహాను బాబు, వల్లంశెట్టి రమేష్, పాల్గొన్నారు...




