Guntur: గుంటూరు జిల్లాలో రేపు సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు బంద్
Guntur: నవంబర్ 5న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో నవంబర్ 3 సాయంత్రం 5 నుండి మద్యం దుకాణాలు బంద్: కలెక్టర్ సాయికాంత్ వర్మ.
Guntur: గుంటూరు జిల్లాలో రేపు సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు బంద్
గుంటూరు: జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాలు ఈ నెల 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి విక్రయాలు నిలుపుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ నవంబరు 5వ తేదీన జరుగుతున్నందున, నిబంధనల మేరకు విక్రయాలు నిలుపుదల చేయడం జరుగుతుందన్నారు.
జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు నవంబరు 5వ తేదీన పోలింగ్ ఉన్నందున, 48 గంటల ముందు నుండి మద్యం విక్రయాలు చేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్నికల నిబంధనలు, సంబంధిత చట్టాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
సైలెంట్ పీరియడ్ పాటించాలి
పోలింగ్ కు ముందు 48 గంటల సైలెంట్ పీరియడ్ విధిగా పాటించాలన్నారు. బి.ఎన్.ఎస్ 163 ను పోలింగ్ కేంద్రాల వద్ద అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్లు లోపల ఎవరు ఉండరాదన్నారు. పోలింగ్ రోజు, నవంబరు 5వ తేదీన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు గోప్యతను విధిగా పాటించాలన్నారు.




