Guntur: గుంటూరు నుంచి విజయవాడ రాజ్‌భవన్‌కు వామపక్ష శ్రేణుల తరలింపు!
Guntur: ఎన్నికల వ్యవస్థలో అక్రమాలకు వ్యతిరేకంగా ఈనెల 10న విజయవాడ రాజ్‌భవన్ ముట్టడికి తరలివెళ్లనున్నట్లు వామపక్ష నేతలు కోట మాల్యాద్రి, కే. నీలకాంత్ తెలిపారు.
Guntur: గుంటూరు నుంచి విజయవాడ రాజ్‌భవన్‌కు వామపక్ష శ్రేణుల తరలింపు!
Guntur: ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలు, ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఈనెల 10న దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, సీపీఎం నగర కార్యదర్శి కే. నీలకాంత్ తెలిపారు. ఈ మేరకు గురువారం గుంటూరులోని మల్లయ్య లింగం భవన్‌లో జిల్లా వామపక్ష పార్టీల నాయకుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కోట మాల్యాద్రి, నలనికాంత్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడాల్సిన ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు చోరీ, ఎన్నికల చోరీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులు, వామపక్ష శక్తులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా గుంటూరు జిల్లాలోనూ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 10న ఉదయం 10 గంటలకు విజయవాడలోని రాజ్‌భవన్ వద్ద జరిగే ఆందోళన కార్యక్రమానికి గుంటూరు జిల్లా నుంచి వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివెళ్లనున్నట్లు చెప్పారు.
అదే రోజు సాయంత్రం 4 గంటలకు గుంటూరు లాడ్జి సెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వామపక్ష నాయకులు, అభ్యుదయవాదులు, మేధావులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని కాపాడేందుకు ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలని, ఓటర్ల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను నిర్వర్తించాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కోరారు.
సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్‌కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, ప్రజాపోరు నాయకులు రవికుమార్, చిన్న, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ఎన్.వి. కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.




