Guntur: గుంటూరులో మహిళలకు పోలీసుల అవగాహన సదస్సు!

Guntur: గుంటూరులో మహిళలకు పోలీసుల అవగాహన సదస్సు డ్రగ్స్, మహిళలు-పిల్లలపై అఘాయిత్యాల నివారణపై కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి సూచనలు అత్యవసర హెల్ప్‌లైన్లపై అవగాహన.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 29 Sept 2026 11:28 PM IST
Guntur
X

Guntur: గుంటూరులో మహిళలకు పోలీసుల అవగాహన సదస్సు!

గుంటూరు: మాదక ద్రవ్యాల వినియోగం, మహిళలు మరియు పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళలకు పోలీసులు అవగాహన కల్పించారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామిరెడ్డి తోటలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట సీఐ విరయ్య చౌదరి మహిళలకు పలు సూచనలు చేశారు.

మహిళలపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే కఠినమైన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మగ పిల్లలు, ఆడ పిల్లలు అనే తేడా లేకుండా పిల్లలను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. వారి ప్రవర్తన, స్నేహాలు, ఆన్‌లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలని సూచించారు.

ప్రస్తుతం కొంతమంది పిల్లలు సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చెడు సావాసాలకు అలవాటు పడుతున్నారని, అందువల్ల పిల్లలను ఫోన్లకు వీలైనంత దూరంగా ఉంచాలని సూచించారు.

గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలి

తమ ప్రాంతాల్లో ఎవరైనా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 112, మహిళల సహాయం కోసం 181, 1091, పిల్లల కోసం 1098 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.

అలాగే తమ ప్రాంతాల్లో ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించినా, అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నా వెంటనే కొత్తపేట పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

ప్రజల సహకారంతో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంతో పాటు మహిళలు, పిల్లలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని సీఐ విరయ్య చౌదరి తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN